Amitabh Bachchan: 'నేనే కనుక సూపర్‌ మ్యాన్‌లా మారగలిగితే..' అంటూ ఆసక్తికర ఫొటో పోస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్

amitab about corona
  • కరోనా వ్యాప్తిపై అమితాబ్‌ బచ్చన్ పోస్ట్
  • సూపర్‌ మ్యాన్‌ దుస్తుల్లో బిగ్‌ బీ
  • తాను సూపర్‌ మ్యాన్‌ అయితే కరోనాను నాశనం చేస్తానని వ్యాఖ్య  
కరోనా వ్యాప్తిపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్ మరోసారి స్పందించారు. తనను కలిసేందుకు అభిమానులు రావద్దని ఇటీవలే ఆయన సూచించిన విషయం తెలిసిందే. తాను సూపర్‌ మ్యాన్‌ గెటప్‌లో తీసుకున్న ఓ ఫొటోను ఆయన తాజాగా పోస్ట్ చేశారు.

చాలా ఏళ్ల క్రితం తాను తన కుమారుడు అభిషేక్‌ ఫ్యాన్సీ డ్రెస్‌ బర్త్‌డే పార్టీ సందర్భంగా ఈ డ్రెస్‌ వేసుకున్నానని అమితాబ్ తెలిపారు. ఇది సూపర్‌ మ్యాన్‌ థీమ్‌ డ్రెస్‌ అని పేర్కొన్నారు. తాను నిజ జీవితంలో సూపర్‌ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనాను నాశనం చేస్తానని తెలిపారు. కాగా, రేపటి జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ఆయన ప్రజలకు సూచించారు.

 కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగ్‌లు వాయిదా పడడంతో నటులందరూ ఇళ్లలోనే ఉంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ కూర్చుంటున్నారు.
Amitabh Bachchan
Bollywood
Corona Virus

More Telugu News