RTC: ఏపీలో రేపు ఆర్టీసీ బస్సులు తిరగవు: రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటన

No rtc services tommoro says minister nani
  • జనతా కర్ప్యూ నేపథ్యంలో నిర్ణయం
  • ఉదయం నుంచి రాత్రి వరకు సర్వీసులుండవు
  • దూర ప్రాంతాల బస్సులకు ఈ అర్ధరాత్రి నుంచే బ్రేక్‌

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన 'జనతా కర్ప్యూ' పిలుపు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు బస్సు సర్వీసులన్నిటినీ ఆపేస్తున్నామని, దూర ప్రాంత సర్వీసులను ఈ రోజు అర్ధరాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు. తమ నిర్ణయానికి ప్రైవేటు బస్సు యాజమాన్యాలు కూడా సహకరించి, తమ సర్వీసులను నిలిపివేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

  • Loading...

More Telugu News