Corona Virus: భారత్‌లో 271కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఐసీఎంఆర్
- ఇప్పటివరకు నలుగురి మృతి
- ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి
- కరోనా బాధితుల్లో 39 మంది విదేశీయులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారితో గతంలో కలిసున్న వారికి పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించిన విషయం తెలిసిందే.