Uttar Pradesh: మంత్రులకు వర్క్ ఫ్రం హోమ్.. ఆదేశాలు జారీ చేసిన యోగి

Yogi Adityanath advises ministers to work from home
  • యూపీలో విస్తరిస్తున్న కరోనా వైరస్
  • కనికా కపూర్ పార్టీకి హాజరైన మంత్రి జై ప్రతాప్ సింగ్
  • సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్న మంత్రి
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా సచివాలయానికి రాకుండా... ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో ఇచ్చిన పార్టీకి యూపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరుకావడంతో... ఇప్పుడు ఆయన స్వయంగా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. మరోవైపు, కరోనా విస్తరించకుండా యూపీ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది.
Uttar Pradesh
Ministers
Work From Home
Yogi Adityanath

More Telugu News