West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లా యువకుడి చేతిపై ముద్ర... బస్సు దింపి పోలీసులకు అప్పగింత!

Police arrested Gost Godavari dist man while going on bus
  • దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన యువకుడు
  • క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు
  • బస్సులో అనుమానించిన తోటి ప్రయాణికులు
క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో జరిగిందీ ఘటన. దుబాయ్ నుంచి ముంబై వచ్చిన యువకుడిని అక్కడి అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు.

అనంతరం సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. అతడి చేతికి ఉన్న ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా తీయడంతో కంగారు పడిపోయాడు. అనుమానించిన ప్రయాణికులు అతడిని వెంటనే బస్సు నుంచి కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
West Godavari District
Dubai
Corona Virus
LB Nagar
Hyderabad

More Telugu News