ఉత్తమ్ వ్యక్తిత్వం ఉన్న నేత ..కించపరిచేలా మాట్లాడొద్దు: రేవంత్ కు జగ్గారెడ్డి హితవు
- ఖైదీలు వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తమ్ పై రేవంత్ విమర్శలా!
- సిన్సియర్ గా పని చేస్తున్న ఉత్తమ్ ను చెడగొట్టద్దు
- కోర్ కమిటీ లో అన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది
టీ– పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయమై ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియదు గానీ, రాష్ట్రంలో మాత్రం ‘న్యూసెన్స్’ జరుగుతోందంటూ పరోక్షంగా రేవంత్ పై మండిపడ్డారు. పీసీసీ పదవిని ఉత్తమ్ కు హైకమాండ్ అప్పజెప్పింది తప్ప, ఆయనేమీ పైరవీ చేసి ఆ పదవి తెచ్చుకోలేదని అన్నారు. ఆ పదవి కోసం కొందరు పాకులాడుతున్నారంటూ రేవంత్ పై జగ్గారెడ్డి పరోక్షంగా దుమ్మెత్తి పోశారు.