ముంబయి సింగర్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్

  • భవిందర్ సింగ్ తో అమలాపాల్ పెళ్లి ఫొటోలు వైరల్
  • గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ తో అమల పెళ్లి
  • కొంతకాలానికే విడాకులు
  • అమల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం
దక్షిణాది అందాలభామ అమలాపాల్ తన ప్రియుడ్ని పెళ్లాడింది. ముంబయి గాయకుడు భవిందర్ సింగ్ తో ఆమె పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అమలాపాల్ కు గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహం జరిగింది.

అయితే కొంతకాలానికి ఇద్దరి మధ్య కలతలు రావడంతో వారి దాంపత్యం విచ్ఛిన్నమైంది. ఇద్దరూ విడాకులు తీసుకోగా, గతేడాది విజయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. విడాకుల తర్వాత అమలాపాల్ పై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆమె మళ్లీ ప్రేమలో పడిందంటూ కథనాలు వచ్చాయి. తాజాగా తన పెళ్లితో అమలాపాల్ వాటన్నింటికి ముగింపు పలికింది. కాగా, ఈ పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యుల ఆమోదం ఉన్నట్టు తెలుస్తోంది.

Amala Paul
Bhavinder Singh
Marriage
South
Cinema
Mumbai
Singer
Tollywood
Kollywood

More Telugu News