Kanna Lakshminarayana: ఆ రోజు అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లండి: కన్నా

Kanna Lakshminarayana supports Janata Curfew and ask people to follow
  • మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామన్న కన్నా
  • ఆదివారం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచన
  • అత్యవసర సేవల్లో పనిచేస్తున్నవారికి కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. అత్యవసర పనులకు మాత్రమే బయటికి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని, కరోనా వ్యాప్తిని అడ్డుకుని ప్రజల్లో అవగాహన పెంచుదామని పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పనిచేస్తున్నవారికి ఆదివారం కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ కన్నా పిలుపునిచ్చారు.
Kanna Lakshminarayana
Janata Curfew
Narendra Modi
Corona Virus
India
BJP

More Telugu News