Yuzvendra Chahal: క్రికెటర్ చాహల్ బుగ్గగిల్లిన అమ్మాయి.. వైరల్‌గా మారిన టిక్‌టాక్‌ వీడియో

Yuzvendra Chahal Gets His Cheeks Pulled In TikTok Video
  • టిక్‌టాక్‌ వీడియోలతో ఎంజాయ్‌ చేస్తున్న క్రికెటర్‌‌ యజువేంద్ర చాహల్‌
  • బ్రేక్‌ను మరో రకంగా ఆస్వాదిస్తున్న యువ స్పిన్నర్‌‌
  • ఇళ్లకే పరిమితమైన ఇతర క్రికెటర్లు

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆటలకు బ్రేకులు పడ్డాయి. స్టేడియాలు, మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్సులకు తాళాలు వేసేశారు. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా అరుదుగా లభించే ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. భారత్‌లో క్రికెటర్లు సహా పలువురు ఆటగాళ్లు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

అయితే, టీమిండియా స్పిన్నర్‌‌ యజువేంద్ర చాహల్ మాత్రం భిన్నమైన దారి ఎంచుకున్నాడు. జట్టుతో ఉన్నప్పుడు సహచరులతో సరదాగా ఇంటర్వ్యూలు చేసి అలరించే అతను ఇప్పుడు టిక్‌టాక్‌ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా డ్యాన్స్‌ చేయడంతో పాటు తన స్నేహితురాళ్లతో చాహల్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు టిక్‌టాక్‌లో హల్ చల్‌ చేస్తున్నాయి.

తాజా వీడియోలో చాహల్‌ను ఓ అమ్మాయి ఆటపట్టించి అతని బుగ్గలు గిల్లడం ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం వినిపిస్తుండగా ఓ అమ్మాయితో చాహల్ సరదాగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతను ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుండి తన షూ లేస్‌ను సరిచేసుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అతని వెనక్కువెళ్లి కనిపించకుండా ఆట పట్టిస్తుంది. ఇది చూసిన చాహల్.. కొడతా అన్నట్టుగా ఆమెపైకి చెయ్యెత్తుతాడు. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ అతని చెంప గిల్లి అక్కడి నుంచి పారిపోతోంది. ఈ వీడియో టిక్‌టాక్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

  • Loading...

More Telugu News