Amaravati Farmers: అమరావతి రైతుల నిరసనలపై కరోనా ఎఫెక్ట్!

Corona virus effect on Amaravati farmers protests
  • మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు
  • అమరావతి ప్రాంతంలో ఆందోళన
  • నిరసనల కొనసాగింపుపై నేడు నిర్ణయం తీసుకోనున్న రైతులు
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిరసనలు, ఆందోళనలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఈ నిరసన కార్యక్రమాలపై కూడా పడింది. ఇప్పటికే అమరావతికి సమీపంలో ఉన్న మంగళగిరిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో... ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, నిరసన శిబిరాలను కొనసాగించవద్దని రైతులు, మహిళలను అధికారులు కోరారు. దీంతో, ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి ఈరోజు ఎక్కడికక్కడ శిబిరాల్లో వారంతా సమావేశం కానున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
Amaravati Farmers
Protests
Corona Virus

More Telugu News