తిరుమల, కాశీ మూతపడతాయని ఏనాడో చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం!
- కరోనా భయంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేత
- వందల ఏళ్ల క్రితమే జోస్యం చెప్పిన బ్రహ్మంగారు
- 1892 తరువాత తొలిసారి ఇలా
ఇక తిరుమల విషయంలోనూ బ్రహ్మాంగారు చెప్పిందే నిజమైంది. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయ చరిత్రలో స్వామి దర్శనాలకు భక్తులను అనుమతించకపోవడం ఇది రెండోసారి. 1892లో స్వామివారి ఆలయాన్ని ఓసారి మూసి వేశారు. అందుకు కారణాలు ఏంటన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. ఆ తరువాత భక్తుల రాకను నిలిపివేసిన సందర్భం ఇదే.