Jagan: ఏపీ సీఎం జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష

AP CM Jagan conducts high level meeting
  • ‘కరోనా’ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  •  సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష
  • హాజరైన మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని తదితరులు

కరోనా వైరస్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. కాగా, ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.

ఇదిలా ఉండగా, ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. నేటి నుంచి విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News