Corona Virus: 'కరోనా'పై కేంద్ర మంత్రుల కీలక భేటీ
- హ్యాండ్ శానిటైజర్‌లతో చేతులను శుభ్రం చేసుకున్న మంత్రులు
- తీసుకోవాల్సినే చర్యలపై చర్చ
- ఈ రోజు రాత్రి మోదీ కీలక ప్రకటన?
దేశంలో క్రమంగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై చర్చించడానికి ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఇందులో కేంద్రమంత్రులు జై శంకర్, హర్దీప్ సింగ్ పూరీ, హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని చౌబే హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలా వ్యవహరించాలన్న అంశంతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై వారు చర్చిస్తున్నారు.
సమావేశం ప్రారంభం కావడానికి ముందు వారంతా హ్యాండ్ శానిటైజర్‌లతో చేతులను శుభ్రం చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు కరోనాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ఆదేశాలు చేయనున్నట్లు తెలుస్తోన్న నేపథ్యంలో వాటి అమలుపై సమన్వయంతో ఎలా వ్యవహరించాలన్న అంశాలపై కేంద్ర మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.