Dabbawalas: ముంబై డబ్బావాలాలపై కరోనా ప్రభావం.. సేవలు నిలిపివేత!

Mumbai Dabbawalas Suspend Tiffin Delivery Till March 31
  • మార్చి 31 వరకు సేవలను బంద్ చేసిన డబ్బావాలాలు
  • మహారాష్ట్రలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం
  • భారీ వర్షాల సమయంలో కూడా విధులను నిర్వర్తించిన డబ్బావాలాలు
ముంబై మహానగరంలో డబ్బావాలలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆఫీసుల్లో పని చేస్తున్న వారికి వారివారి ఇళ్ల నుంచి వేడివేడి ఆహారాన్ని తీసుకొచ్చి అందించడం వీరి వృత్తి. దశాబ్దాలుగా డబ్బావాలాలు ఈ పనిలో ఉన్నారు. ముంబై వాసులతో వీరికున్న అనుబంధం చాలా గొప్పది. అలాంటి డబ్బావాలాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం చూపింది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31వ తేదీ వరకు తమ విధులను నిలిపివేయాలని వారు నిర్ణయించారు.

ముంబైని భారీ వర్షాలు కుదిపేస్తున్న సమయంలో కూడా డబ్బావాలాలు తమ సేవలను కొనసాగించారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా మారతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సేవలను బంద్ చేయాలని నిర్ణయించారు.
Dabbawalas
Mumbai
Corona Virus

More Telugu News