KTR: ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వినతి

ktr requests pm modi
  • విదేశీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయులు 
  • భారతీయులను తీసుకురావడానికి మిషన్ ప్రారంభించాలి
  • వారి కనీస అవసరాలు తీర్చండి
  • వారిని సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి 
కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేటీఆర్ వినతి చేశారు.

'శ్రీ నరేంద్ర మోదీజీ.. మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలంపూర్‌ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి మిషన్ ప్రారంభించి, వారి కనీస అవసరాలు తీర్చండి.. వారిని సురక్షితంగా భారత్‌ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి' అని కోరారు. ఈ సందర్భంగా పలువురు తనకు చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఆయన పోస్ట్ చేశారు.
KTR
TRS
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News