Prabhas: ప్రైవేట్ జెట్ విమానంలో జార్జియా నుంచి వచ్చిన ప్రభాస్!

Prabhas Completes Jorgia Schedule
  • రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా
  • జార్జియాలో ముగిసిన షెడ్యూల్
  • ఫోటో పోస్ట్ చేసిన రాధాకృష్ణ
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన ప్రభాస్, తిరిగి వచ్చాడు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో జార్జియా నుంచి చిత్ర యూనిట్ ప్రైవేట్ జెట్ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చింది. విమానంలో ప్రభాస్ ఉన్న చిత్రాన్ని రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు కనిపిస్తున్నారు. ఇక, జార్జియాలో షూటింగ్ ను ఎలాంటి అసౌకర్యమూ లేకుండా పూర్తి చేశామని రాధాకృష్ణ తెలిపారు. కాగా, ఉగాది నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని సమాచారం.
Prabhas
Jil
Radhakrishna
Jorgia

More Telugu News