Corona Virus: కరీంనగర్‌లో ఇండోనేషియా వాసుల సంచారం.. రంగంలోకి 100 ప్రత్యేక వైద్య బృందాలు

Indonesia people rounds in Karimnagar govt alerted
  • ఈ నెల 14, 15 తేదీల్లో ఇండోనేషియా వాసుల పర్యటన
  • వారిలో 8 మందికి కరోనా
  • నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు
కరీంనగర్ ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది. ఇండోనేషియాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 14, 15 తేదీల్లో పట్టణంలో పర్యటించారు. వారిలో 8 మందికి కరోనా సోకినట్టు తేలడంతో పట్టణం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పట్టణంతోపాటు వారు ఇండోనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాలపై దృష్టిసారించారు. వారు ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో పర్యటించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే వారు తిరిగిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు, ఈ నెల 16న 12 మంది పట్టణవాసులను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ పంపిన అధికారులు, నిన్న మరో 9 మందిని తరలించారు. కాగా, నేటి నుంచి 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు.
Corona Virus
Karimnagar District
Indonesia
Telangana

More Telugu News