Corona Virus: కరోనా భయంతో ఆసుపత్రి నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య!

Man jumps from Safdarjung Hospital amid corona virus fear
  • స్క్రీనింగ్ పరీక్షల్లో బయటపడిన కరోనా లక్షణాలు
  • సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలింపు
  • ఒత్తిడి భరించలేక ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న భయంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ వ్యక్తి తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. స్క్రీనింగ్ పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఓ వ్యక్తిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు ఏడో అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంతో ఒత్తిడికి గురైన సదరు వ్యక్తి తాను చికిత్స పొందుతున్న వార్డు నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Corona Virus
New Delhi
Safdarjung hospital
suicide

More Telugu News