Corona Virus: మహారాష్ట్రలో మరో ఇద్దరు మహిళలకు ‘కరోనా’.. నివారణ చర్యలపై మహారాష్ట్ర సీఎం పలు నిర్ణయాలు

Two more corona cases in Maharastra
  • ముంబైకు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి ‘కరోనా’ పాజిటివ్
  • పూణెకు చెందిన యువతికి కూడా
  • మహారాష్ట్రలో 44 కు చేరిన ‘కరోనా’ బాధితుల సంఖ్య  
మహారాష్ట్రలో మరో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ముంబైకు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి, పూణెకు చెందిన 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో, మహారాష్ట్రలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 44కు చేరింది. ఈ నేపథ్యంలో ‘కరోనా’ నివారణ చర్యలపై మహారాష్ట్ర సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
‌‌
‌‌– యాభై శాతం ప్రభుత్వ ఉద్యోగులు రోజు విడిచి రోజు కార్యాలయాలకు రావాలి
– ముంబయి బస్సుల్లో 50 శాతం ప్రయాణికుల సామర్థ్యమే ఉండాలి
– ప్రయాణికుల మధ్య దూరం పాటించాలి..  నిల్చుని ప్రయాణించవద్దు
– నిర్ణీత సమయాల్లోనే దుకాణాలు తెరవాలి
Corona Virus
Mumbai
Maharashtra
women
positive

More Telugu News