Hyper Aadi: నన్ను బీట్ చేయాలంటే కొన్ని లెక్కలు దాటుకుని రావాలి: హైపర్ ఆది

Jabardasth Comedy Show
  • భ్రమలు వేరు .. నిజాలు వేరు 
  • ఇంతవరకూ 130 స్కిట్లు చేశాను 
  • ఒక స్కిట్ కి 58 మిలియన్ వ్యూస్ వచ్చాయన్న ఆది  
'జబర్డస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో హైపర్ అది ఒకరుగా కనిపిస్తాడు. హైపర్ ఆది పంచ్ ల కోసమే ఆ షోను చూసేవారున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజా ఇంటర్వ్యూలో .. 'అదిరింది' కామెడీ షోలో ఓ కమెడియన్ రేటింగ్ .. హైపర్ ఆది రేటింగ్ కంటే ఎక్కువగా ఉందనే ప్రచారాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది.

 అందుకు హైపర్ ఆది స్పందిస్తూ .. "ఈ మాట మీతో ఎవరన్నారోగానీ .. భ్రమలు వేరు .. నిజాలు వేరు అని గ్రహించాలి. హైపర్ ఆదితో పోల్చుకోవాలన్నా .. బీట్ చేయాలన్నా దానికి కొన్ని లెక్కలు వున్నాయి. 'జబర్దస్త్'లో ఇంతవరకూ 130 స్కిట్లవరకూ చేశాను. వాటిలో 10 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్లు 40వరకూ వున్నాయి. 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన స్కిట్లు 5 వున్నాయి. 30 మిలియన్ వ్యూస్ పైగా వచ్చిన స్కిట్లు 2 వున్నాయి. 58 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్ 1 వుంది. హైపర్ ఆదిని దాటాలంటే .. ఇవన్నీ దాటుకుంటూ రావాలి" అని చెప్పుకొచ్చాడు.
Hyper Aadi
Jabardasth
Adirindi

More Telugu News