BJP: కవితపై పోటీకి బీజేపీ నేత పి.లక్ష్మీనారాయణ

bjp confirms its candidate from nizamabad mlc
  • నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
  • నామినేషన్ వేసిన లక్ష్మీనారాయణ
  • ఈ రోజే కవిత కూడా నామినేషన్  
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శాసన మండలి అభ్యర్థిగా నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. ఆమెను అక్కడి నుంచి గెలిపించి నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ఉన్న పట్టు సడలకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. కాగా, ఈ నియోజక వర్గం నుంచి ఆమెకు పోటీగా బీజేపీ తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఈ మేరకు ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసింది.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో పోతాన్కర్‌ లక్ష్మీనారాయణను దింపుతున్నట్లు ఈ రోజు ఉదయం ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీనారాయణ బీజేపీ తరఫున నామినేషన్‌ వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది.
BJP
Telangana
Nizamabad District

More Telugu News