Corona Virus: చేతులెలా శుభ్రం చేసుకోవాలి.. కేరళ పోలీసుల హ్యాండ్​ వాషింగ్​ డ్యాన్స్​ వైరల్​

This Hand Washing Dance By Kerala Police Is A Viral Hit
  • కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో వీడియో
  • పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నం
  • లక్షల సంఖ్యలో వ్యూస్.. వేలల్లో షేర్లు
కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ కు ఇప్పటివరకు ఎలాంటి మందులు లేకపోవడంతో నివారణ చర్యలే మార్గం. ఎక్కువగా బయట తిరగొద్దని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపుతూ కేరళ పోలీసులు రూపొందించిన సరదా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక నిమిషం వీడియోలో..

కేవలం ఒక నిమిషం నాలుగు సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో కేరళ పోలీసులు చేతులు శుభ్రం చేసుకునే తీరుపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారు చేసిన డ్యాన్స్ సరదాగా, ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉంది. ఆరుగురు పోలీసు సిబ్బంది కేరళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’లోని ‘కలక్కథా..’ అంటూ సాగే హిట్ పాటతో ఈ వీడియో చేశారు.  

ఎనిమిది లక్షల మంది చూశారు.

కేరళ పోలీసులు ఫేస్ బుక్ లో పెట్టిన ఆ వీడియోను ఏకంగా ఎనిమిది లక్షల మందికిపైగా చూశారు. పెద్ద సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి. 28 వేల మందికిపైగా షేర్ చేశారు కూడా. మొత్తంగా కేరళ పోలీసుల ప్రయత్నంపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు.





Corona Virus
COVID-19
Kerala
kerala police
Viral Videos

More Telugu News