భారత సైన్యంలో తొలి కేసు నమోదు.. జవానుకు కరోనా పాజిటివ్
- లడాక్ స్కౌట్స్ లో పని చేస్తున్న జవాను
- ఫిబ్రవరి 27న ఇరాన్ నుంచి వచ్చిన జవాను తండ్రి
- కుటుంబం మొత్తం క్వారంటైన్ కు తరలింపు
జవాను తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి క్వారంటైన్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ అనే విషయం మార్చి 6న తెలిసింది. ఆ మరుసటి రోజు సదరు జవానును కూడా ఐసొలేషన్ కు తరలించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అనే విషయం గత సోమవారం తెలిసింది. దీంతో, ఆయనను కూడా క్వారంటైన్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు, ఒక సోదరిని కూడా ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు.