Jagan: విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి సీఎం జగన్ ఆరా

CM Jagan makes it clear to help telugu people across the world
  • అంతకంతకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
  • మలేసియాలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
  • అనేక దేశాల్లో తెలుగు ప్రజల ఇక్కట్లు
  • రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశం
మలేసియాలో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోవడం సహా అనేక దేశాల్లో తెలుగు ప్రజలు స్వదేశం రాలేక ఇబ్బందులు పడుతున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై సీఎం జగన్ స్పందించారు. విదేశాల్లో నిలిచిపోయిన తెలుగు వ్యక్తుల గురించి ఆరా తీశారు. కరోనా నేపథ్యంలో, తెలుగువారిని రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించారు. ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డితోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు నివేదించాలంటూ ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Jagan
Telugu People
Corona Virus
Foreign Countries

More Telugu News