East coast Railway: ఈస్ట్​ కోస్ట్​ రైల్వేపై ‘కరోనా’ ప్రభావం.. గత ఆరు రోజులుగా లక్షకు పైగా టికెట్లు రద్దు!

Corona Virus effects on East coast Railway
  • గత ఏడాదిలో జరిగిన టికెట్ల రద్దు కంటే ఇది 67 శాతం ఎక్కువ
  • దేశ వ్యాప్తంగా చూస్తే  80 శాతం టికెట్లు రద్దు
  • ‘కరోనా’ ప్రభావంతో పలు ప్రత్యేక రైళ్లు కూడా రద్దు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, సెలెబ్రెటీలు ఏకరవు పెడుతున్న విషయం తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు సాధ్యమైనంత వరకూ వెళ్లొద్దని, అవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్న పలు జాగ్రత్త చర్యలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.  ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు పలువురు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.

గత ఆరు రోజులుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో లక్షకు పైగా టికెట్లు రద్దయ్యాయి. గత ఏడాది మొత్తంలో జరిగిన టికెట్ల రద్దు కంటే 67 శాతం ఎక్కువగా జరిగింది. అదే, దేశ వ్యాప్తంగా చూస్తే కనుక 80 శాతం టికెట్లు రద్దయ్యాయి. ‘కరోనా’ ప్రభావంతో పలు ప్రత్యేక రైళ్లు కూడా రద్దయ్యాయి. మహారాష్ట్రలో ‘కరోనా’ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముంబై నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు.
East coast Railway
Corona Virus
railway tickets
cancelled

More Telugu News