Chandrababu: కేంద్ర నిధులు ఏదో విధంగా తెచ్చుకోవచ్చు కానీ.. భయపడి పారిపోయిన కంపెనీలను ఎలా తేగలం?: చంద్రబాబు

Chandrababu comments on YSRCP Government
  • ఏపీకి రావాల్సిన పెద్ద పరిశ్రమలు వెనక్కిపోయాయి
  • బెదిరింపులకు భయపడి ఆయా సంస్థలు పారిపోయాయి
  • పెట్టుబడులను, ఉద్యోగాలను మళ్లీ ఏ విధంగా తేగలం?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు ఆగిపోతాయంటూ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విశాఖలో రూ.70,000 కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలతో  రావాల్సిన అదానీ సంస్థ, తిరుపతికి రావాల్సిన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, అమరావతికి రావాల్సిన సింగపూర్ కన్సార్టియం వెనక్కి పోయాయని విమర్శించారు.

ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చిందని, ఆసియన్ పేపర్ మిల్స్ ను కూడా తరిమేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడితే ఎంపీలతో ఒత్తిడి చేయించో, కేంద్రానికి లేఖలు రాసో, ఏపీకి రావాల్సిన రూ.4 వేల కోట్లు అడిగి తెచ్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ‘మీ బెదిరింపులకు భయపడి పారిపోయిన ఈ కంపెనీలను, పెట్టుబడులను, ఉద్యోగాలను మళ్లీ ఏ విధంగా తేగలం?‘ అంటూ సీఎం జగన్ ని పరోక్షంగా ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News