Nagababu: మతం, విశ్వాసంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Nagababu says all faiths and religions are the same
  • విశ్వాసం అంటే ఏంటో చెప్పిన మెగాబ్రదర్
  • లాజిక్ లోపించిన నమ్మకమే విశ్వాసం అంటూ ట్వీట్
  • అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు ఒక్కటేనని వెల్లడి
మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు మతం, విశ్వాసంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తర్కం, కారణం, హేతుబద్ధత, ఆధారం, సాక్ష్యం ఇవేవీ అవసరంలేని ఏ నమ్మకమైనా, మరేదైనా ఉందంటే దాన్నే మనం విశ్వాసం అంటాం. అందుకనే అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు ఒక్కటే అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ఇటీవల నాగబాబు తరచుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నారు.
Nagababu
Faith
Religion
Janasena

More Telugu News