Narendra Modi: కరోనా వైరస్‌పై ఎంపీలకు ప్రధాని మోదీ ఆదేశాలు

BJP Parliamentary Party meeting underway at the Parliament Library Building
  • ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • కరోనాపై స్పందించిన ప్రధాని
  • ఎంపీలు తమ నియోజక వర్గాల్లో పర్యటించాలని పిలుపు
  • జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచన
ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో కరోనా వైరస్‌ ప్రభావంపై కూడా పలువురు నేతలు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై మాట్లాడుతూ ఎంపీలకు పలు సూచనలు చేశారు.

ప్రతి బీజేపీ ఎంపీ తమ నియోజక వర్గాల్లో పర్యటించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నేతలు చర్చిస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటికి కరోనా సోకిన వారి సంఖ్య 129కి చేరింది.
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News