Devineni Uma: ఈ నెల చివరి నాటికి జగన్ రాజీనామా చేస్తారు: దేవినేని ఉమ

Jagan will resign by this month end says Devineni Uma
  • అమరావతి ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం భయపడింది
  • ఓటర్లంతా టీడీపీకి ఓటు వేస్తే జగన్ రాజీనామా చేస్తారు
  • రూ. 200 కోట్లకు రాజ్యసభ సీటును అమ్ముకున్నారు
అమరావతి ప్రాంత గ్రామాల్లో వివిధ కారణాలను చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం భయపడిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఎన్నికల్లో 90 శాతానికి పైగా అభ్యర్థులను గెలిపించుకోకపోతే... మంత్రులంతా రాజీనామా చేయాలని జగన్ బెదిరించారని అన్నారు. ఓటర్లంతా టీడీపీకి ఓటు వేస్తే... ఈ నెలాఖరుకి జగన్ రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తారని చెప్పారు.

రూ. 200 కోట్లకు బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటును జగన్ అమ్ముకున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. వైయస్ మరణానికి రిలయన్స్ కారణమని గతంలో చెప్పిన జగన్... ఇప్పుడు ఆ సంస్థకే చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటును ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. నవ మాసాల్లో జగన్ నవ మోసాలు చేశారని మండిపడ్డారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls
Reliance

More Telugu News