Dileep Kumar: కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్న బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్

Dileep Kumar self quarantines due to corona virus fears
  • దేశంలో నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • దిలీప్ కుమార్ ను ఏకాంత గదిలో ఉంచిన సైరాబాను
  • ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకే అని తెలిపిన దిలీప్ కుమార్
దేశ వ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ మహమ్మారి విస్తరిస్తున్న వేగం తక్కువగానే ఉన్నప్పటికీ... రానున్న రోజుల్లో ఇది వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే భయాందోళనలు సర్వత్ర నెలకొన్నాయి. మరోవైపు, బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కరోనా భయాల నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు.

కరోనా సోకకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నానని ఈ సందర్భంగా దిలీప్ కుమార్ తెలిపారు. తన భార్య సైరాబాను ఎలాంటి రిస్క్ ఉండకూడదనే ముందు జాగ్రత్త చర్యగా... తనకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు తనను ఏకాంత గదిలో ఉంచిందని చెప్పారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయసు 97 సంవత్సరాలు.
Dileep Kumar
Bollywood
Corona Virus
Self Quarantine

More Telugu News