Corona Virus: ‘కరోనా’ దృష్ట్యా కొన్ని దేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి నిర్బంధ చికిత్స

  • యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే వారిపై నిబంధనలు  
  • 14 రోజుల నిర్బంధ చికిత్స అందించాలని కేంద్రం నిర్ణయం
  • ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
‘కరోనా’ దృష్ట్యా ప్రయాణ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. కొన్ని దేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి నిబంధనలు తప్పనిసరి చేసింది. యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి విమాన, నౌకాయానాల ద్వారా  వచ్చే ప్రయాణికులకు 14 రోజుల నిర్బంధ చికిత్స అందించాలని  కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Corona Virus
compulsory treatment
UAE
Qatar
Kuwait

More Telugu News