Suma: చేతులు కడుక్కుంటూ వీడియో తీసుకుని.. కరోనా జాగ్రత్తలు చెప్పిన యాంకర్‌ సుమ

Anchor Suma Just a few cautionary steps can stand a long way in our safety and help breaking the chain
  • కరోనా వైరస్‌ నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం
  • చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాను 
  • ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి
  • హగ్గులు, షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వకూడదు 
కరోనాపై అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలుసార్లు సూచనలు చేసిన యాంకర్‌ సుమ మరోసారి ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన చేతులను శుభ్రం చేసుకుని చూపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'కరోనా వైరస్‌ నుంచి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో చెప్పడానికి ఈ వీడియోలో చూపెడుతున్నాను. నేనయితే ప్రతిరోజు శానిటైజర్‌ వాడుతున్నాను. లేకపోతే చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాను' అని తెలిపింది.

'కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధ్యతగా వ్యవహరించాలి. కడుక్కోకుండా చేతులతో ముఖాన్ని టచ్‌ చేయొద్దు. ఒకవేళ దగ్గు, జబులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వారికి దూరంగా ఉండాలి. వారిని వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పాలి' అని సూచించింది.

హగ్గులు వద్దు..
'ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. హగ్గులు, షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వకూడదు. మనం బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు గమనించినట్లయితే నేను మాట్లాడుతుంటే నా చేయి అటోమెటిక్‌గా ముఖంపైకి వెళ్లిపోయింది చూశారా? చేతి నుంచి మనలోనకి వైరస్‌ వెళ్తుంది' అని చెప్పింది.
Suma
Corona Virus

More Telugu News