Yuvraj Singh: హిందీ డైలాగ్ చెప్పడానికి క్రిస్ గేల్‌ తిప్పలు.. నవ్వు ఆపుకోలేకపోయిన యువీ.. వీడియో వైరల్

Confidence meraaaa Kabar banegi teri Well said kaka yuvi
  • వీడియో పోస్ట్ చేసిన యువరాజ్‌
  • ‘కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ డైలాగ్‌ చెప్పాలనుకున్న గేల్
  • ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు తరఫున ఆడనున్న గేల్ 
వెస్టిండీస్‌ క్రికెటర్ క్రిస్ గేల్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నవ్వులు పూయిస్తోన్న ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. క్రిస్ గేల్ హిందీలో ఫన్నీగా డైలాగ్స్ చెప్పాడు.

‘కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ అనే డైలాగ్‌ని చెప్పడానికి గేల్ ప్రయత్నించాడు. ఆయన పడుతున్న తిప్పలు చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వు ఆపులేకపోయారు. 'బాగా చెప్పావు కాకా' అంటూ యువీ ఈ వీడియో పోస్ట్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్‌ ప్రారంభోత్సవం వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే.
Yuvraj Singh
Cricket
Viral Videos

More Telugu News