Rajamouli: ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది: రాజమౌళి ఆందోళన

shocking to see the world come to a standstill says SS Rajamouli
  • కరోనా దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది
  • అంతా అప్రమత్తంగా ఉండాలి
  • భయాందోళనలకు గురి చేసే ప్రచారాలను ఆపేయాలి
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పట్ల టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలను భయపెట్టే ప్రచారాలను ఆపేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరూ పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను షేర్ చేశారు.
Rajamouli
Corona Virus
Tollywood

More Telugu News