Bandi Sanjay: నేను సిద్ధాంతాలను నమ్మాను, నన్ను పార్టీ నమ్మింది: బండి సంజయ్

Bandi Sanjay appointed as Telangana BJP chief
  • తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ నియామకం
  • పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సంజయ్
  • తెలంగాణలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని సంజయ్ ఉద్ఘాటన
తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ వచ్చాడు. డాక్టర్ లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, తాను సిద్ధాంతాలను నమ్మానని, పార్టీ తనను నమ్మిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని, బీజేపీ ఎవరికీ వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల్లోకి బీజేపీని తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఉద్ఘాటించారు.

నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటామని, పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Bandi Sanjay
BJP
Telangana
Chief

More Telugu News