ఇంకో ఆరు వారాలు చంద్రబాబు ప్రశాంతంగా జీవించొచ్చు: వైసీపీ నేత అమర్​ నాథ్​

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా
  • వైరస్ లు చంద్రబాబుకు కూడా సహకరించాయి
  • ప్రత్యర్థులను బెదిరించి గెలవాల్సిన అవసరం మాకు లేదు
కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, వైరస్ లు కూడా చంద్రబాబునాయుడుకి సహకరించాయని, ఇంకో ఆరు వారాలు చంద్రబాబు ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనపడుతోందని, టీడీపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు వచ్చాయని జోస్యం చెప్పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రత్యర్థులను బెదిరించి  గెలవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.




More Telugu News

Gudivada Amarnath YSRCP Chandrababu Telugudesam