Nara Lokesh: పది నెలల తుగ్లక్ పాలన లో నిరుద్యోగులను నిలువునా ముంచారు: నారా లోకేశ్​

Nara Lokesh criticises CM Jagan
  • చంద్రబాబు హయాంలోనే యువతకు ఎక్కువ శాతం ఉద్యోగాలు 
  • ఏపీకి వస్తా అన్న కంపెనీలనూ వద్దన్నారు
  • ‘నిరుద్యోగ భృతి’ కూడా ఎత్తేశారు
చంద్రబాబు హయాంలోనే యువతకు ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చాయన్న విషయాన్ని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిందని, నిజాన్ని ఒప్పుకుందని టీడీపీ నేత నారాలోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుందని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిందని, 10 నెలల తుగ్లక్ పాలన లో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. ఉన్న కంపెనీలను తరిమేశారు. ఏపీకి వస్తా అన్న కంపెనీలనూ వద్దన్నారని, ‘నిరుద్యోగ భృతి’ కూడా ఎత్తేసి ఆకలేసి కేకలేసే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News