Kesineni Nani: కరోనా భయమా.. ఓటమి జ్వరమా?.. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి: కేశినేని నాని
- సీన్ రివర్స్ అయ్యింది
- నిన్నటి దాకా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు, టీడీపీ అధినేత
- ఈ రోజు వైసీపీ, సీఎం జగన్
'కరోనా భయమా.. ఓటమి జ్వరమా..' అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థ ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేశారు.
'సీన్ రివర్స్ అయ్యింది ...నిన్నటి దాకా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ రోజు వైసీపీ, సీఎం జగన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ అసంతృప్తి.. గవర్నర్ హరిచందన్ వద్దకు సీఎం జగన్' అంటూ టీవీల్లో వస్తోందని చెప్పారు.