mumbai: అభిమానులూ... నా ఇంటికి రాకండి : బాలివుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ విజ్ఞప్తి

amitab asks fans to dont come to my house due to corona
  • కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో నిర్ణయం
  • ఈరోజు తాను ఎవరినీ కలవనని స్పష్టీకరణ
  • ప్రతి ఆదివారం అభిమానులను పలకరించడం బిగ్‌బీ అలవాటు
కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో సీనియర్‌ బాలివుడ్‌ నటుడు, సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని కోరారు. ప్రతివారం ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో కాసేపు ముచ్చట్లాడడం అమితాబచ్చన్‌ అలవాటు. ఈ సందర్భంగా అభిమానులందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అయితే కరోనా ప్రమాదం నేపథ్యంలో ఈవారం దీన్ని రద్దు చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అందువల్ల అభిమానులు దీన్ని గుర్తించి తన ఇంటికి రావద్దని కోరారు.
mumbai
Amitabh Bachchan
Corona Virus
Fans

More Telugu News