Gorantla Butchaiah Chowdary: బుచ్చయ్య చౌదరిగారూ...మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి : చంద్రబాబు

Birth day wishes to buchayya chowdaray by chandrbabu and lokesh
  • సీనియర్‌ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అధినేత
  • మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ ట్వీట్‌
  • ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపిన లోకేష్‌
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో మెసేజ్‌ పోస్టు చేశారు. ‘చౌదరిగారు...మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండైన ప్రజా జీవితాన్ని అందుకునేందుకు మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా బుచ్చయ్య చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ‘తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం  నుంచి పార్టీలో ఉంటూ రాజమండ్రి ప్రజలకు సేవలందిస్తున్న బుచ్చయ్య చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ లోకేష్‌ ట్వీట్‌చేశారు.
Gorantla Butchaiah Chowdary
Chandrababu
Nara Lokesh
birthday wishes

More Telugu News