Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు కరోనా లేదు... రక్తపరీక్షల్లో నెగటివ్ వచ్చిందన్న వైట్ హౌస్!

No Corona for Trump
  • ఇటీవల బ్రెజిల్ నేతలతో ట్రంప్ భేటీ
  • బోల్సోనారో కార్యదర్శికి సోకిన కరోనా
  • ముందు జాగ్రత్తగా ట్రంప్ పరీక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు కరోనా వైరస్ సోకలేదని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ లో హెల్త్ ఎమర్జెన్సీని విధించిన తరువాత, ట్రంప్ తన రక్త నమూనాలను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు వైద్యులు రక్తాన్ని సేకరించి, ల్యాబ్ కు పంపారు. రక్త పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చింది.

కాగా, యూఎస్ లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోలను ట్రంప్ కలిశారు. ఆపై ఫాబియోకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, ట్రంప్ కూడా పరీక్షలు చేయించుకున్నారు.
Donald Trump
Corona Virus
Negative
White House

More Telugu News