Hyderabad: ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకున్న ప్రిన్సిపాల్.. పాఠశాలపై దాడిచేసిన కుటుంబ సభ్యులు!

Principal Arrested for second marriage in Hyderabad
  • హైదరాబాద్‌లోని కార్మిక నగర్‌లో ఘటన
  • తన వయసులో సగం ఉన్న టీచర్‌ను రెండో పెళ్లి చేసుకున్న వైనం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టిన ఓ ప్రిన్సిపాల్.. ఉపాధ్యాయురాలిని రెండో పెళ్లి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హబీబ్ ఫాతిమా నగర్‌కు చెందిన అయూబ్ అలీ (42) కార్మికనగర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు.

అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి(23)తో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న అయూబ్ అలీ తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి పది రోజుల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి బంధువులు, కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలపై శనివారం దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఫర్నిచర్, కంప్యూటర్, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయూబ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
Hyderabad
Teacher
marriage
Karmikanagar
principal

More Telugu News