Tollywood: థియేటర్ల మూసివేతపై చర్చించిన టాలీవుడ్ నిర్మాతల మండలి!

Tollywood Producers Council Meeting Over Theaters Clousure
  • సినిమా రంగంపై కరోనా ప్రభావం
  • ఇప్పటికే వాయిదా పడిన పలు సినిమాలు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని వెల్లడి
కరోనా వైరస్ ప్రభావం సినిమా రంగంపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఉగాది పండగ సందర్భంగా విడుదల కావాల్సిన నాని చిత్రం 'వి' వాయిదా పడగా, రాష్ట్రంలోని సినిమా హాల్స్ అన్నింటినీ ఈ నెలాఖరు వరకూ మూసి వేయాలని కేసీఆర్ సర్కారు ఆదేశించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడంతో థియేట‌ర్స్ మూత పడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

ఇక తాజాగా సమావేశమైన టాలీవుడ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందులపై చర్చించిన మండలి, విడుదల కావాల్సిన అన్ని సినిమాలనూ రెండు వారాల పాటు వాయిదా వేస్తామని వెల్లడించారు. 
Tollywood
Movies
Theaters
Closed
KCR
Council

More Telugu News