Corona Virus: కేసీఆర్ బెస్ట్ సీఎం అని మరోసారి అనిపించుకున్నారు: చిరంజీవి

Chiranjeevi Hails KCR
  • కరోనా నియంత్రణకు తీసుకున్న నిర్ణయాలపై హర్షం
  • ఆయన ఏం చేసినా ప్రజల కోసమే
  • ప్రజలు సహకరించాలని వినతి
కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన మరోసారి ఉత్తమ నేతనని అనిపించుకున్నారని ప్రశంసించారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజల ఆరోగ్యాన్ని, అవసరాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటారని, కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించిన చిరంజీవి, కరోనా నియంత్రణలో భాగంగా 'ఆచార్య' సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Corona Virus
KCR
Chiranjeevi

More Telugu News