YSRCP: ఏపీ స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల వైసీపీ ఏకగ్రీవం... పోలింగ్ కు ముందే అధికార పక్షం ఆధిపత్యం!

YSRCP dominates as their candidates elected unanimous in local polls
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • పులివెందులలో 7 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం
  • ప్రకాశం జిల్లాలో 14 జడ్పీటీసీల్లో అధికార పక్షం ఏకగ్రీవం
  • గుంటూరు జిల్లాలోనూ అదే సీన్
  • 193 ఎంపీటీసీల్లో వైసీపీ హవా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ జరగకముందే అధికార వైసీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయనగరం జిల్లాలో 3 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం సాధించింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో 7 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం నమోదు చేసింది. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో 65 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీ వశం అయ్యాయి.

అటు, గుంటూరు జిల్లాలోని 8 జడ్పీటీసీల్లో వైసీపీ ఏకగ్రీవం అయింది. కాగా, గుంటూరు జిల్లాలో వైసీపీ 193 ఎంపీటీసీల్లో ఏకగ్రీవం కాగా, టీడీపీ 5, ఇండిపెండెంట్లు మరో ఐదు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ ఆధిక్యం కనిపిస్తోంది. ఇక్కడ 14 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
YSRCP
ZPTC
MPTC
Telugudesam
Local Body Polls
Andhra Pradesh

More Telugu News