Vijay Sai Reddy: త్వరలో వైసీపీలోకి మరికొందరు కీలక నేతలు వస్తున్నారు: విజయసాయిరెడ్డి

Few more leaders are joining YSRCP says Vijay Sai Reddy
  • జీవీఎంసీ ఎన్నికల్లో 95 స్థానాల్లో గెలిపిస్తే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
  • భోగాపురం ఎయిర్ పోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది
  • పురుషోత్తంపట్నం నుంచి విశాఖకు తాగునీరు అందించే పనులు జరుగుతున్నాయి
త్వరలో వైసీపీలోకి మరికొందరు కీలక నేతలు రాబోతున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 98 స్థానాలకు గాను 95 స్థానాల్లో గెలిపిస్తే... నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పురుషోత్తంపట్నం నుంచి విశాఖకు తాగినీటిని అందించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
Vijay Sai Reddy
YSRCP
Vizag

More Telugu News