Pawan Kalyan: జనసేన ఆవిర్భావం రోజున మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను!: పవన్ కల్యాణ్

pawan kalyan about his career
  • నాతో సినిమా తీస్తే దాదాపు రూ.70 లక్షలతో మాత్రమే తీయొచ్చన్నారు
  • కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తే చాలా గొప్ప అన్నారు
  • నా స్థాయిని పరిమితం చేశారు
  • కానీ, కష్టపడి పనిచేసి ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తన స్థాయి చాలా తక్కువగా ఉంటుందని అప్పట్లో కొందరు అన్నారని, అయితే, తన స్థాయి ఏంటో ఆ తర్వాత నిరూపించుకున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో పవన్ మాట్లాడారు.
 
'2014లో పార్టీ ప్రారంభించాం.. ఏడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. సినిమాల్లోకి రాకముందు నన్ను కొందరు.. నాతో సినిమా తీస్తే దాదాపు రూ.70 లక్షలతో మాత్రమే తీయొచ్చన్నారు. కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తే చాలా గొప్ప అన్నారు. నా స్థాయికి పరిమితం చేశారు' అని చెప్పారు.

'కానీ, ఒకరి స్థాయి ఇంతే అని నేను నమ్మను. ఆ రోజున వాళ్ల మాటలకు ప్రభావితమై నా స్థాయి అంతేనని నేను కూడా నిర్ణయం తీసుకుంటే ఈనాడు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకునే వాడిని కాదు. వాళ్ల మాటలను నమ్మి ఉంటే నిజంగానే నా స్థాయి అలాగే ఉండేది' అని తెలిపారు.

'భగవంతుడు నాకిచ్చిన జీవితంలో నా శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకుని పని చేస్తాను. అన్ని పనులను సంపూర్ణంగా చేశాను. నటుడిగానూ అలాగే సంపూర్ణంగా పనిచేశాను. రాజకీయాల్లోనూ ప్రతికూల పవనాలు వున్నప్పుడే నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను' అని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News