Junior NTR: ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం: 'జబర్దస్త్' నవీన్

Jabardsth Naveen
  • కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని
  • చిరంజీవిగారిపై క్రేజ్ పెరిగింది 
  • ఎన్టీఆర్ మంచిమనిషన్న నవీన్     
'జబర్దస్త్' కామెడీ షోతో నవీన్ బాగా పాప్యులర్ అయ్యాడు. ఒక వైపున ఆయన కామెడీ షోలు చేస్తూనే, మరో వైపున సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "కృష్ణ .. చిరంజీవి తరువాత నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్. ఆయన తొలి సినిమా అయిన 'నిన్ను చూడాలని' షూటింగు జరుగుతుండగా వెళ్లి కలిశాను. అప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు.

ఆ తరువాత 'స్టూడెంట్ నెంబర్ వన్'.. 'సుబ్బు' .. 'సాంబ' .. 'ఆది' సినిమాల్లో ఆయనతో కలిసి నటించే అవకాశం లభించింది. ఇలా వరుసగా సినిమాలు చేయడం వలన, ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్నేహితులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లాను. మమ్మల్ని లోపలికి పిలిపించడమే కాకుండా, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నటన పరంగా .. వ్యక్తిత్వం పరంగా నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చాడు.
Junior NTR
Naveen
Tollywood

More Telugu News