Kesineni Nani: జగన్ గారూ.. మీ అరాచకాలను ఇక్కడ సాగనివ్వరు: కేశినేని నాని

Do you want to make Vijayawad like Rayalaseema and Palnadu questions Kesineni Nani to Jagan
  • విజయవాడను రాయలసీమ, పల్నాడు మాదిరి చేద్దామనుకుంటున్నారా?
  • మీ అరాచకాలను విజయవాడ ప్రజలు సాగనివ్వరు
  • నామినేషన్ల సందర్భంగా హింసపై కేశినేని నాని విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు.

విజయవాడను కూడా రాయలసీమ, పల్నాడు మాదిరి చేద్దామనుకుంటున్నారా జగన్ గారూ? అని ప్రశ్నించారు. విజయవాడ ప్రజలు మీ ఆటలను సాగనివ్వరని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన 'బరితెగింపు.. గెలుపే లక్ష్యంగా వైసీపీ అరాచకాలు' అనే కథనం స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls

More Telugu News