Corona Virus: 9 మంది కరోనా బాధితులు జంప్.. గాలిస్తున్న అధికారులు!

9 corona virus patients escapes form isolation wards
  • పంజాబ్ కు చెందిన ఏడుగురు అదృశ్యం
  • కేరళ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అమెరికా దంపతులు
  • అప్రమత్తమైన అధికారులు
మన దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో రెండు మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 9 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వీరిలో పంజాబ్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన దంపతులు. వీరిద్దరూ కేరళలోని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కరోనా బాధితులు అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు.

Corona Virus
Patients
Escape

More Telugu News